WEBVTT 00:00:02.800 --> 00:00:05.220 పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. 00:00:05.220 --> 00:00:08.514 పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చిన కధ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 00:00:08.520 --> 00:00:11.220 దాని గురించి అపొస్తలుల కార్యాలు 19 వ అధ్యాయంలో చదవొచ్చు. 00:00:11.220 --> 00:00:12.896 ఎఫెసు ఒక పెద్ద నగరం. 00:00:12.900 --> 00:00:16.240 అనేకమంది గ్రీకు, రోమను దేవతలకు అది ఆరాధనా కేంద్రంగా ఉండేది. 00:00:16.240 --> 00:00:20.340 రెండు సంవత్సరాలకు పైగా పౌలు ఇక్కడ పరిచర్య చేశాడు. 00:00:20.340 --> 00:00:22.640 అనేకమంది యేసు అనుచరులుగా మారారు. 00:00:22.640 --> 00:00:27.640 కొన్ని సంవత్సరాల తరవాత రోమీయులు తనను చెరసాలలో బంధించిన సమయంలో పౌలు ఈ ఉత్తరం రాశాడు. 00:00:27.640 --> 00:00:31.580 దీని కూర్పు ఈ ఉత్తరాన్ని రెండు స్పష్టమైన భాగాలుగా చేస్తున్నది. 00:00:31.580 --> 00:00:34.940 మొదటి సగంలో పౌలు సువార్త గురించి చర్చించాడు. 00:00:34.940 --> 00:00:38.660 ఈ చరిత్ర అంతా ఏవిధంగా దాని ముగింపుకు చేరుకున్నదో, 00:00:38.660 --> 00:00:42.380 యేసు తన శిష్యులతో కూడిన బహుళజాతి సమాజాన్ని స్థాపించడం, మొదలైనవి. 00:00:42.380 --> 00:00:45.960 “కాబట్టి” అనే మాటతో ఈ మనం రెండో సగంలోకి ప్రవేశిస్తాం. 00:00:45.960 --> 00:00:49.980 ఇక్కడ సువార్త కథ వ్యక్తిగతంగా మన జీవితాన్ని, మన ఇరుగు పొరుగులు, 00:00:49.980 --> 00:00:55.840 సమాజాలను, ఇంకా మన కుటుంబాలను ఏవిధంగా ప్రభావితం చేయాల్సి ఉందో పౌలు వివరించాడు. 00:00:55.840 --> 00:00:58.700 పౌలు ఈ తలంపులన్నిటినీ ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్తాడో చూద్దాం. 00:00:58.700 --> 00:01:04.420 యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి ఆయన్ని స్తుతిస్తూ 00:01:04.420 --> 00:01:08.560 రాసిన ఒక యూదుల శైలితో ఉన్న పద్యంతో 1 వ అధ్యాయం ప్రారంభమైంది. 00:01:08.570 --> 00:01:14.600 ఆదినుండి తండ్రి ఒక నిబంధనా ప్రజలను ఎన్నుకొని వారిని దీవించాలని సంకల్పించాడు. 00:01:14.600 --> 00:01:16.759 ఇక్కడ ఒకసారి ఆదికాండం 12:1-3 లోని 00:01:16.760 --> 00:01:19.260 అబ్రాహాము కుటుంబం గురించి ఆలోచించండి 00:01:19.260 --> 00:01:23.000 ఇప్పుడు యేసు ద్వారా ఎవరైనా ఆ కుటుంబంలో సభ్యులు కావచ్చు. 00:01:23.000 --> 00:01:26.900 యేసు మరణం మన అతి నికృష్టమైన పాపాలను, మన వైఫల్యాలను కప్పుతుంది. 00:01:26.900 --> 00:01:29.760 ఆయనలో మనం దేవుని కృపను పొందుతాం. 00:01:29.760 --> 00:01:36.799 నిజానికి ఆ కృప మన జీవితాల్లో ప్రతి విభాగాన్ని సరిగా అర్థం చేసుకోడానికి ఒక కొత్త మార్గాన్ని తెరచింది. 00:01:36.800 --> 00:01:44.500 1వ అధ్యాయం 10 వచనంలో పరలోకంలో, భూమిమీదా సమస్తాన్నీ క్రీస్తు అధికారం కింద ఏకం చేయాలని దేవుని సంకల్పం. 00:01:44.500 --> 00:01:46.500 క్రీస్తు అంటే మెస్సీయకు పర్యాయ పదం. 00:01:46.500 --> 00:01:52.980 దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ యేసు మెస్సీయలో ఏకం చేయబడిన మానవులతో ఒక పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండాలన్నదే. 00:01:52.980 --> 00:01:59.080 మనం మొదట ఆ కుటుంబంలో ప్రవేశించినప్పుడు దైవికమైన ఆ సంకల్పం వెల్లడి అయ్యింది అని పౌలు చెబుతున్నాడు. 00:01:59.180 --> 00:02:02.275 ఇక్కడ అతడు అబ్రాహాము కుటుంబంలోని యూదా జాతి గురించి మాట్లాడుతున్నాడు. 00:02:02.280 --> 00:02:06.020 ఆ తరవాత నువ్వు, అంటే యూదేతరుల గురించి మాట్లాడుతూ 00:02:06.020 --> 00:02:09.220 మీరు యేసు గురించి, ఆయన ద్వారా కలిగే రక్షణ గురించీ ఏవిధంగా విన్నారో చెప్పాడు. 00:02:09.220 --> 00:02:13.720 మీరు కూడా ఆ కుటుంబంలోకి పరిశుద్ధాత్మ కార్యం ద్వారా ప్రవేశించారు. 00:02:13.720 --> 00:02:18.530 ఇక్కడ అతడు అపొస్తలుల కార్యాలు గ్రంథంలో దేవుని ఆత్మ ఏవిధంగా యూదులనూ 00:02:18.530 --> 00:02:23.200 యూదేతరులనూ యేసులో ఒక కుటుంబంలోకి ఏకం చేసి కలిపాడో ప్రస్తావించాడు. 00:02:23.200 --> 00:02:25.939 అది సరిగ్గా పురాతన కాలంలో దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినట్టుగా జరిగింది. 00:02:25.940 --> 00:02:30.580 పౌలు ఈ గీతంలో తండ్రి అయిన దేవుడు, తరవాత కుమారుడైన దేవుడు, 00:02:30.580 --> 00:02:34.500 చివరిగా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాడు. 00:02:34.500 --> 00:02:36.260 All three work together. త్రిత్వంలోని ముగ్గురూ కలిసి పనిచేశారు. 00:02:36.260 --> 00:02:39.340 పౌలు ఇక్కడ అద్భుతమైన రీతిలో సువార్తను వర్ణించాడు. 00:02:39.340 --> 00:02:41.880 ఆ గీతం అయిపోయిన తరవాత, పౌలు ఒక ప్రార్థనతో ముగించాడు. 00:02:41.881 --> 00:02:49.099 ఈ యేసు అనుచరులు కేవలం సువార్త గురించి తెలుసుకోవడం కాదు గానీ ఆ సువార్త శక్తిని వ్యక్తిగతంగా అనుభవించాలని అతడు ప్రార్థన చేశాడు. 00:02:49.100 --> 00:02:52.860 ఏ శక్తి అయితే యేసును మరణం నుండి తిరిగి లేపి ఆయన్ని ఈ సర్వ లోకానికీ ప్రభువుగా హెచ్చించిందో 00:02:52.860 --> 00:02:56.180 ఆ శక్తి చేత వారు బలోపేతం చేయబడాలని అతడు కోరుకున్నాడు. 00:02:56.182 --> 00:03:01.700 2వ అధ్యాయంలో పౌలు తిరిగి వెనక్కి వెళ్లి మొదటి అధ్యాయంలోని గీతంలో అతడు వెలిబుచ్చిన కొన్ని కీలకమైన అంశాలను మరింత విస్తృత పరిచాడు. 00:03:01.700 --> 00:03:05.860 మరి ముఖ్యంగా దేవుని కృప, ఈ యేసు యొక్క బహుళజాతి కుటుంబం గురించి. 00:03:05.860 --> 00:03:10.360 యూదేతర క్రైస్తవులు ఏవిధంగా యేసును తెలుసుకున్నారో మళ్ళీ వివరించడంతో ఇది ప్రారంభమైంది. 00:03:10.360 --> 00:03:15.340 యేసును గురించి వినక ముందు వారు భౌతికంగా జీవించే ఉన్నారు కానీ ఆధ్యాత్మికంగా మరణించారు. 00:03:15.340 --> 00:03:19.200 స్వార్ధంతో, పాపంతో నిండిన ఒక దారీ తెన్నూ లేని జీవితంలో చిక్కుకుపోయారు. 00:03:19.200 --> 00:03:22.660 అంధకార, ఆధ్యాత్మిక దుష్ట శక్తుల మోసానికి గురై ఉన్నారు. 00:03:22.660 --> 00:03:26.726 అయితే ఆశ్చర్యకరంగా తన గొప్ప ప్రేమ, కనికరంతో దేవుడు వారిని రక్షించాడు. 00:03:26.726 --> 00:03:32.449 ఆయన వారి పాపాలన్నిటినీ క్షమించి వారి జీవాన్ని యేసు పునరుత్థాన జీవంతో ఏకం చేశాడు. 00:03:32.449 --> 00:03:34.500 వారిని తిరిగి జీవింప జేశాడు కూడా. 00:03:34.500 --> 00:03:38.820 ఇప్పుడు యేసుద్వారా నూతన పురుషులుగా సృష్టించబడిన వారుగా 00:03:38.820 --> 00:03:45.320 దేవుడు తమ కోసం ఏర్పాటు చేసిన కొత్త పిలుపు, కొత్త సంకల్పాలను గ్రహించే సంతోషం, ఆధిక్యత వారికి కలిగింది. 00:03:45.320 --> 00:03:50.420 వారి పైన దేవుని కృప కుమ్మరించడమే కాదు వారిని ఒక కొత్త కుటుంబంలోకి ఆహ్వానించాడు. 00:03:50.420 --> 00:03:54.703 యేసును గురించి వినక ముందు, యూదేతర క్రైస్తవులు దేవునినుండి వేరైపోయి ఉన్నారు. 00:03:54.703 --> 00:04:00.000 అంతే కాదు, వారు ఆయన నిబంధనా ప్రజలైన అబ్రాహాము కుటుంబానికి వేరుగా ఉన్నారు. దానికి ఒక కారణం ఉంది. 00:04:00.000 --> 00:04:04.660 సీనాయి నిబంధనలోని ఆజ్ఞలు ఆ కుటుంబం చుట్టూ ఒక ప్రహరీ గోడలాగా నిలబడి ఉన్నాయి. 00:04:04.660 --> 00:04:08.300 దగ్గరకు రానీయకుండా అనేకమంది యూదేతరులకు అవి అడ్డుగోడగా నిలిచాయి. 00:04:08.307 --> 00:04:13.747 అయితే యేసులో ధర్మశాస్త్ర నియమాలన్నీ నెరవేరి ఆ అడ్డుగోడ తొలగిపోయింది. 00:04:13.760 --> 00:04:20.555 పౌలు చెప్పినట్టుగా ఆ రెండు జాతుల గుంపులకు ఆయన “సంధి చేసి ఆ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు.” 00:04:20.560 --> 00:04:25.480 3 వ అధ్యాయంలో ఆ సువార్తను యూదేతర ప్రజలకు ప్రకటింప జేసే ఒక ప్రత్యేకమైన పాత్రను దేవుడు తనకు 00:04:25.480 --> 00:04:28.220 అనుగ్రహించిన దానిని బట్టి పౌలు ఆశ్చర్యచకితుడు అవుతున్నాడు. 00:04:28.220 --> 00:04:34.740 తాను జైలులో ఉన్నప్పటికీ ఈ కొత్త నిబంధనా కుటుంబం విస్తరించడం చూడగలుగుతున్నందుకు అతడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. 00:04:34.740 --> 00:04:37.820 కాబట్టి పౌలు ఈ ఉత్తరం మొదటిభాగాన్ని మరొక ప్రార్థనతో ముగించాడు. 00:04:37.820 --> 00:04:45.270 ఈసారి యేసు అనుచరులు తన ప్రజల పట్ల క్రీస్తు కలిగి ఉన్న ప్రేమను గ్రహించి దానిని అర్థం చేసుకోడానికి 00:04:45.270 --> 00:04:48.140 దేవుని ఆత్మ వారిని బలపరచాలని పౌలు ప్రార్థించాడు. 00:04:48.140 --> 00:04:51.420 ఇక ఈ ఉత్తరం రెండో సగంలో పౌలు తన వేగం పెంచాడు. 00:04:51.420 --> 00:04:57.720 పాటకులు తమ జీవిత విధానాలలో మార్పుల ద్వారా సువార్తకు స్పందించాలని అతడు సవాలు చేస్తూ ప్రారంభించాడు. 00:04:57.720 --> 00:05:01.300 4వ అధ్యాయంలో సంఘంలో అనుదిన జీవితం గడిపే అంశంతో అతడు ప్రారంభించాడు. 00:05:01.300 --> 00:05:04.920 సంఘం విభిన్న రకాల ప్రజలు కలిసి ఉన్న ఒక పెద్ద కుటుంబం. 00:05:04.920 --> 00:05:07.740 కానీ వారంతా ఒక్కటే అని అతడు నొక్కి చెబుతున్నాడు. 00:05:07.740 --> 00:05:09.660 ఒక్కటి అనే మాట ఈ అధ్యాయంలో కీలకమైన పదం. 00:05:09.660 --> 00:05:12.600 వారంతా ఒక్క ఆత్మ చేత ఏకం చేయబడిన ఒక్క శరీరం. 00:05:12.600 --> 00:05:14.780 వారిదంతా ఒకే విశ్వాసం, ఒక్కడే ప్రభువు. 00:05:14.780 --> 00:05:17.640 వారికి ఉన్నది ఒకే బాప్తిస్మం. వారంతా నమ్మేది ఒకే ఒక్క దేవుణ్ణి. 00:05:17.640 --> 00:05:19.660 వారిమధ్య అంతా ఐక్యత నిలిచి ఉంది. 00:05:19.660 --> 00:05:24.220 అయితే పౌలు ఐక్యత, ఏకరూపత అనేవి రెండు వేరువేరు విషయాలు అని వారికి చెబుతున్నాడు. 00:05:25.720 --> 00:05:30.360 యేసు కుటుంబం అనేక రకాల విభిన్నమైన ప్రజలతో నిండి ఉంది అని చెబుతూ, 00:05:30.360 --> 00:05:36.380 కానీ వారిలో ఒక్కొక్కడూ తన ప్రత్యేకమైన సామర్ధ్యాలు, అభిరుచులు ఉపయోగించి ఒకరికొకరు సేవ చేయడానికీ, ప్రేమించుకోడానికీ 00:05:36.380 --> 00:05:39.700 తద్వారా సంఘాన్ని వృద్ధి చెందించడానికీ వారిని శక్తివంతం చేసేది పరిశుద్ధాత్మ మాత్రమే. 00:05:39.700 --> 00:05:41.880 ఇక్కడ అతడు రెండు అందమైన అలంకారాలు ప్రయోగించాడు. 00:05:41.880 --> 00:05:45.080 ఒకటి, సంఘాన్ని ఒక కొత్త దేవాలయంగా అభివృద్ధి చెందించడం. 00:05:45.080 --> 00:05:50.420 రెండు, యేసును తమ నాయకునిగా కలిగి వారంతా ఒక కొత్త పురుషుడుగా రూపొందుతూ ఉండడం. 00:05:50.420 --> 00:05:54.540 తరవాతి రెండు అధ్యాయాల్లో ఈ కొత్త పురుషుడు అనే అంశం మీదే పౌలు తన చర్చను కొనసాగిస్తున్నాడు. 00:05:54.540 --> 00:05:59.780 ప్రతి క్రైస్తవుడూ తన ప్రాచీన స్వభావాన్ని లేక ప్రాచీన పురుషుణ్ణి మనం పాత వస్త్రాలు తీసివేసినట్టుగా విడిచిపెట్టి మనలో పునరుద్ధరించబడిన 00:05:59.780 --> 00:06:04.620 దేవుని స్వరూపం అయిన కొత్త పురుషుణ్ణి ధరించుకోవాలి అని పౌలు సవాలు చేస్తున్నాడు. 00:06:04.620 --> 00:06:09.520 ఈ పాత, కొత్త పురుషులు లేక స్వభావాలను పోలుస్తూ అతడు ఒక సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు. 00:06:09.520 --> 00:06:13.620 అబద్ధాలకు బదులు, కొత్త పురుషులు సత్యమే పలుకుతారు. 00:06:13.620 --> 00:06:17.540 కోపం పెంచుకునే బదులు వారు తమ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. 00:06:17.540 --> 00:06:20.780 కొత్త పురుషులు దొంగతనాలు చేయరు, ఔదార్యం కలిగి ఉంటారు. 00:06:20.780 --> 00:06:24.220 వ్యర్ధంగా మాట్లాడరు, తమ మాటలతో ఇతరులను ప్రోత్సహిస్తారు. 00:06:24.220 --> 00:06:27.500 ప్రతీకారం తీర్చుకునే బదులు క్షమిస్తారు. 00:06:27.500 --> 00:06:34.680 అదుపులేని విధంగా లైంగిక వాంఛలు తీర్చుకోడానికి బదులు కొత్త పురుషులు తమ శరీర వాంఛలలో ఇంద్రియ నిగ్రహం పాటిస్తారు. 00:06:34.680 --> 00:06:40.020 మద్యం మత్తులో మునిగిపోయే బదులు కొత్త పురుషులు దేవుని ఆత్మ ఆధీనంలో ఉంటారు. 00:06:40.020 --> 00:06:43.900 ఆత్మ నింపుదల ప్రభావం నాలుగు రకాలుగా ఉంటుందని పౌలు వివరించాడు. 00:06:43.900 --> 00:06:45.700 మొదటి రెండూ పాటలు పాడడానికి సంబంధించినవి. 00:06:45.700 --> 00:06:48.220 అందరూ కలిసి పాడడం, ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకోవడం. 00:06:48.220 --> 00:06:51.227 యేసుకు చెందిన మనుషుల్లో పరిశుద్ధాత్మ ఏవిధంగా పనిచేస్తాడు అని ఆలోచించగానే 00:06:51.227 --> 00:06:56.440 పౌలుకు మొట్టమొదట వచ్చిన తలంపు పాటలు, సంగీతం గురించి కావడం చాలా ఆసక్తికరంగా ఉంది. 00:06:56.440 --> 00:07:00.460 ఆత్మ నింపుదల ప్రభావంలో మూడవ ఫలితం ప్రతివిషయంలో కృతజ్ఞత కలిగి ఉండడం. 00:07:00.460 --> 00:07:03.580 ఇక నాలుగో ఫలితం పరిశుద్ధాత్మ యేసు అనుచరులను ఎప్పుడూ ఎదుటివారిని 00:07:03.580 --> 00:07:10.940 తమకంటే ఎక్కువ ప్రాముఖ్యమైన వారుగా భావించి వారిని హెచ్చిస్తూ, తమను తాము తగ్గించుకునేలా చేస్తాడు. 00:07:10.940 --> 00:07:17.200 ఈ నాలుగో అంశాన్ని పౌలు మరికొంత విస్తరిస్తూ అది క్రైస్తవ వివాహంలో ఏవిధంగా పనిచేస్తుందీ వివరించాడు. 00:07:17.200 --> 00:07:21.760 విశ్వాసి అయిన ఒక భార్య ఉంది. ఆమె తన భర్తను గౌరవించి తన విషయంలో 00:07:21.760 --> 00:07:24.160 బాధ్యత తీసుకొనే పని అతనికి విడిచిపెట్టాలి. 00:07:24.160 --> 00:07:31.900 భర్త అయితే తన భార్యను ప్రేమించి తన స్వంత కార్యాలు పక్కనబెట్టి తన క్షేమం కంటే ఆమె క్షేమానికి 00:07:31.900 --> 00:07:34.959 ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తన బాధ్యతను నెరవేర్చాలి. 00:07:34.960 --> 00:07:40.500 నిజానికి ఇలాంటి వివాహం సువార్త కథను ప్రతిబింబిస్తుంది. 00:07:40.500 --> 00:07:45.020 భర్త చర్యలు యేసును, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 00:07:45.020 --> 00:07:50.400 భార్య చర్యలు యేసు ప్రేమను పొంది ఆయన ద్వారా ఒక కొత్త వ్యక్తిగా మారిన సంఘాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 00:07:50.400 --> 00:07:56.020 ఇదే భావనను పౌలు పిల్లలకు వారి తల్లిదండ్రులకు, దాసులకు, వారి యజమానులకు కూడా వర్తింప జేశాడు. 00:07:56.020 --> 00:08:01.880 చివరిగా పౌలు క్రైస్తవుల జీవితాలపై ఆధ్యాత్మిక దుష్ట శక్తుల ప్రభావం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. 00:08:01.880 --> 00:08:06.940 ఆ దుష్ట శక్తులు యేసు ప్రజల్లో నెలకొన్న ఐక్యతను భంగపరచి తమ కొత్త స్వభావం విషయంలో 00:08:06.940 --> 00:08:09.400 రాజీ పడేలా చేయడానికి ప్రయత్నిస్తాయి. 00:08:09.400 --> 00:08:14.860 కాబట్టి పౌలు అలంకార రూపకమైన ఆధ్యాత్మిక ఆయుధాలను ధరించి స్థిరంగా నిలబడాలని వారిని హెచ్చరించాడు. 00:08:14.860 --> 00:08:17.410 ఇక్కడ వాటి గురించిన వర్ణన చూడవచ్చు. 00:08:17.410 --> 00:08:21.560 ఈ సర్వాంగ కవచంలోని ఆయుధాలను పౌలు యెషయా గ్రంథం నుండి తీసుకున్నాడు. 00:08:21.560 --> 00:08:24.220 అవన్నీ యెషయా చేసిన మెస్సీయ వర్ణనలో కనిపిస్తాయి. 00:08:24.220 --> 00:08:29.480 ఇప్పుడు ఆ మెస్సీయ అనుచరులుగా మనం ఆయన గుణ లక్షణాలను అలవరచుకోవాలి. 00:08:29.540 --> 00:08:31.420 ఎందుకంటే సంఘమే ఆయన శరీరం. 00:08:31.420 --> 00:08:35.980 క్రైస్తవులు తమకు తాముగా ప్రార్థన, వాక్య ధ్యానం, ఇతరులతో సంబంధాలను పెంపొందించుకోవడం ఇలాంటి 00:08:35.980 --> 00:08:40.240 ఆచరణాత్మకమైన అలవాట్లను రూపొందించుకోవడం ద్వారా మనం పరిణతి చెందిన క్రైస్తవులుగా లేక యేసు అనుచరులుగా 00:08:40.240 --> 00:08:43.460 అభివృద్ధి చెందాలని పౌలు భావం అని నేను భావిస్తున్నాను. 00:08:43.466 --> 00:08:46.244 ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. 00:08:46.244 --> 00:08:47.320 బహు శక్తివంతమైన ఉత్తరం. 00:08:47.320 --> 00:08:54.220 ఈ ఉత్తరం ద్వారా పౌలు మొత్తం సువార్త సారాంశాన్ని క్రోడీకరించి దానిని మన జీవితంలోని ప్రతి రంగాన్ని ఏవిధంగా ప్రభావితం చేయనివ్వాలో కూలంకషంగా వివరించాడు.